సిగ్నల్ వ్యవస్థకు సంబంధించిన సాంకేతిక లోపంతో ఒక గంట పాటు వేమూరుల్లో రైలు నిలిచిపోయిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. రేపల్లె నుంచి మధ్యాహ్నం మూడున్నర గంటలకు తెనాలి బయలుదేరి 07875నెంబరు గల డెమో రైలు వేమూరు చేరుకునేసరికి సిగ్నల్‌కు సంబంధించిన సాంకేతిక లోపంతో గంటకు పైగా నిలిచిపోయింది. సిబ్బంది తక్షణం మరమ్మత్తులు చేసి రైలు వెళ్ళేందుకు మార్గం సుగమం చేయగా 4.57 గంటలకు రైలు బయలుదేరి వెళ్ళింది. రైలు గంటపాటు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.