అనంతపురంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి లక్ష్మీనరసింహ బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన కార్పొరేట్ పాఠశాలలు, విద్యాసంస్థలు ధనార్జనే ధ్యేయంగా చేసుకున్నారని ఆరోపించారు. అలాగే అక్రమంగా లక్షల రూపాయలు వసూలు చేస్తున్న సంస్థలపై కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు.