భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ మూడో సారి అంతరిక్ష యాత్రకు సిద్ధమయ్యారు. ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి బోయింగ్ స్టార్ లైనర్ రాకెట్ లో మరో వ్యోమగామి విల్మార్తో కలిసి ఆమె ఇవాళ రా. 10 గంటలకు అంతరిక్షంలోకి బయలుదేరనున్నారు. వీరు వారం రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడుపుతారు. ఈ యాత్ర మే 7నే జరగాల్సి ఉండగా సాంకేతిక కారణాలతో చివరి నిమిషంలో వాయిదా పడింది.