తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగ భగలు కొనసాగుతోన్నాయి. మే నెల చివరి వారంలో కూడా ఎండలు విజృంభిస్తున్నాయి. ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోహిణి కార్తె సందర్భంగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో వాతావరణ చల్లని కబురు చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో శనివారం (ఈ రోజు) నుంచి మూడు రోజులు వర్షాలు పడతాయని అధికారులు వివరించారు. ఆదివారం నైరుతి రుతు పవనాలు కేరళ తీరాన్ని తాకనున్న సంగతి తెలిసిందే. ఆ ప్రభావంతో ముందుగా ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో శని, ఆది, సోమ మూడు రోజులు వర్ష ప్రభావం ఉంటుందని అధికారులు వెల్లడించారు.