విజయనగరం జిల్లా కేంద్రం దిశ మహిళా పోలీస్స్టేషన్ల్లో శుక్రవారం హోంగార్డు రాజ్‌కుమార్‌పై అత్యాచార కేసు నమోదైనట్లు దిశ మహిళా పోలీస్ స్టేషన్ సీఐ నాగేశ్వరరావు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా శ్రీకూ ర్మాంకు చెందిన రాజ్‌కుమార్ శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈనెల 28న పోలీస్ వాహనంలో విజయనగరం వచ్చి అనంతరం విజయనగరం నుంచి కుమిలి, పూసపాటిరేగ మీదుగా శ్రీకాకుళం వైపు వెళ్తుండగా అదే సమయంలో విజయనగరంలోని లంకవీధి, జొన్నగుడ్డు ప్రాంతానికి చెందిన ఓ జంట ద్విచక్రవాహనంపై అదే రహదారిలో పూసపాటి రేగ వైపు వెళ్తున్నారు. గుణుపూర్‌పేట డంపింగ్ యార్డు సమీపానికి వచ్చేసరికి హోంగార్డు వారి ద్విచక్రవాహనాన్ని అడ్డగించి ఆ జంటను బెదిరించి సమీప నిర్మాణుష్యమైన తోటలోకి తీసుకెళ్లి మహిళపై అత్యాచార యత్నానికి పాల్ప డ్డాడు. అనంతరం ఆ జంట తేరుకుని డెంకాడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. డెంకాడ పోలీసులు సంబంధిత కేసును దిశ పోలీస్ స్టేషన్‌కు రిఫర్ చేశారు. దీనిపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అనంతరం సీసీ కెమెరాలు పరిశీలించి అత్యాచారానికి పాల్పడ్డ హోంగార్డును గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగేశ్వరరావు తెలిపారు.