రాజాం మండల పరిధిలోని వి.ఆర్.అగ్రహారం గ్రామానికి చెందిన బంగారు రామచంద్రరావు (54) రాజాంలోని చీపురుపల్లి రోడ్లోని ఓ పెట్రోల్ బంక్లో జారిపడి శుక్రవారం ఉదయం మృతి చెందినట్లు రాజాం ఎస్.ఐ. రవికిరణ్ తెలిపారు. బంక్లో కొంతకాలంగా పనిచేస్తున్న రామచంద్ర రావు శుక్రవారం ఉదయం బాత్రూంకి వెళ్లి వచ్చే సమయంలో జారిపడ్డంతో తలకు గాయం తగిలినట్లు ఎస్.ఐ. తెలిపారు. బంక్ సిబ్బంది సపర్యలు చేసినా ఫలితం దక్కలేదని పేర్కొన్నారు. మృతుడి భార్య సుజాత ఇచ్చిన ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేసినట్లు ఎస్.ఐ. రవికిరణ్ పేర్కొన్నారు.