విజయవాడలో డయేరియా మరణాలపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం వెంటనే సమస్యపై దృష్టి పెట్టాలన్నారు. కలుషిత నీరు సరఫరా కారణంగానే ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందన్నారు. దీనిపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. డయేరియాతో కాకుండా ఇతర అనారోగ్య కారణాలతో వీరంతా చనిపోయారని అధికారులు చెప్పడం సరికాదన్నారు. కలుషిత నీటిపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై అధికారులు స్పందించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.