జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఘోర పరాజయం తప్పదని తెలుసుకున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సచివాలయం నుంచి కీలకమైన ఫైల్స్, ఈ ఫైల్స్ ను మాయం చేసే పనిలో ఉన్నాడని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు విమర్శించారు. అడ్డగోలుగా వ్యవహరిస్తున్న సీఎస్ పట్ల కేంద్ర ఎన్నికల కమిషన్ ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ విధుల నుంచి తప్పిస్తున్న వారి స్థానాల్లో తిరిగి వైసీపీకి అనుకూలంగా వ్యవహరించే అధికారుల పేర్లనే సీఎస్ పంపుతున్నారన్నారు. మంత్రి విడదల రజినీకి తొత్తుగా వ్యవహరిస్తున్న ఆర్ఓ రాజ్యలక్ష్మిని ఓట్ల లెక్కింపు ప్రక్రియ నుంచి వెంటనే తప్పించాలని కనపర్తి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.