హనుమాన్ జయంతి పురస్కరించుకుని కడప చెన్నై జాతీయ రహదారి కనుమలోపల్లిలో వెలసిన శ్రీ దక్షిణాముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ వ్యవస్థాపకుడు లక్ష్మయ్య ఆధ్వర్యంలో స్వామి వారికి ఆకుపూజ, గణపతి హోమం, లక్ష్మీ హోమం, నవగ్రహ హోమం పూజలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు.