ఏపీలోఎన్డీఏ కూటమి గెలుపు దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. కూటమి జెట్ స్పీడ్‌లో దూసుకెళుతోంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని చోట్ల కూటమిదే హవా. అసెంబ్లీలోనే కాదు.. లోక్‌సభలోనూ సత్తా చాటుతోంది. కృష్ణా, విజయనగరం, విశాఖలలో వైసీపీ కనీసం ఖాతా కూడా తెరవలేదు. ఉత్తరాంధ్రలో కూటమి అభ్యర్థులు పూర్తి స్థాయి మెజారిటీని కనబరుస్తున్నారు. గొడవలు జరిగిన తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి తదితర ప్రాంతాలన్నింటిలోనూ కూటమి సత్తా చాటుతోంది. దక్షిణ కోస్తాలో తిరుగులేని విజయం దిశగా దూసుకెళుతోంది. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో టీడీపీ కూటమి కీలక పాత్ర పోషించనుంది. ఇక నగరిలో అయితే టీడీపీ సంబరాల్లో మునిగిపోయింది. రోజా, కొడాలి నాని, అనిల్ వంటి కీలక నేతలంతా కౌంటింగ్ కేంద్రం నుంచి ఇంటి బాట పట్టారు. కీలక మంత్రులంతా దాదాపు ఓటమి బాటలోనే ఉన్నారు. ఇప్పటి వరకైతే 18 సీట్లకే వైసీపీ పరిమితమైంది. టీడీపీ కార్యకర్తల విజయోత్సహాలు మిన్నంటుతున్నాయి. వైసీపీకి కంచుకోట అయిన రాయలసీమలోనూ కూటమి దుమ్మురేపుతోంది. ఇక జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో 19 స్థానాల్లో విజయం దిశగా దూసుకెళుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa