రాష్ట్రంలో సుపరిపాలన కోసం ప్రజలు కూటమికి ఘనవిజయం చేకూర్చారని బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు దేవర ఈశ్వరరావు అన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ వైసీపీకి ఇదొక గుణపాఠం అన్నారు. బిజెపి, జనసేన పొత్తుతో టిడిపి ఘన విజయం సాధించింది అన్నారు. గజపతినగరం అభివృద్ధికి శ్రీనివాస్ తోడ్పడతారని అన్నారు. నియోజకవర్గ కో కన్వీనర్ దుర్గాప్రసాద్, నవీన్ కుమార్, ఏడుకొండలు, తదితరులు పాల్గొన్నారు.