ఏపీ ఎన్నికల్లో కూటమి ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ఉండవల్లిలోని పార్టీ అధినేత చంద్రబాబు నివాసంలో కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు, నారా లోకేశ్, భువనేశ్వరి, బ్రాహ్మణి, దేవాన్ష్, ఇతర కుటుంబ సభ్యులు కేరింతలు కొడుతూ ఫలితాలను ఆస్వాదించారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ముఖ్యంగా నారా లోకేశ్ తల్లి భువనేశ్వరిని హత్తుకుని ఆనందం వెలిబుచ్చారు. చిన్నారి దేవాన్ష్ కేక్ కోసి అందరికీ తినిపించాడు. ఈ వేడుకల్లో నందమూరి కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.