గుంటూరు జిల్లా కొమ్మూరు ఎస్సీ కాలనీకి చెందిన మూకిరి ఏషయ్య(46) వైయస్ఆర్సీపీ ఆవిర్భావం నుంచి పార్టీ అంటే ఎంతో అభిమానంగా ఉండేవాడు. మూడు రోజుల కిందట వెలువడిన ఎన్నికల ఫలితాలను చూసి అన్యాయం జరిగిందంటూ తీవ్ర మనో వేదనకు లోనవుతూ బుధవారం రాత్రి అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు ప్రైవేట్ వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యుడు చెప్పాడు. ఆటో నడుపుకొనే ఏషయ్యకు కుమారుడు, కుమార్తె ఉన్నారు.