పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం సంకురాత్రిపాడు గ్రామంలో బుధవారం రాత్రి టీడీపీ వర్గీయులు గ్రామ సచివాలయం వద్ద బీభత్సం సృష్టించారు. సచివాలయం భవనంపైకి ఎక్కి.. బోర్డులు, శిలాఫలకాలను ధ్వంసం చేశారు. ట్రాక్టర్‌తో దిమ్మెలు కూలగొట్టారు. బొడ్డురాయి సెంటర్లో ఉన్న వైయస్ఆర్సీపీ జెండాను చింపేశారు. సచివాలయం సమీపంలో దాతలు ఏర్పాటు చేసిన సిమెంటు బల్లలను ధ్వంసం చేశారు. సచివాలయంపై టీడీపీ, జనసేన, బీజేపీ జెండాలు కట్టారు. కేంద్ర ప్రభుత్వ సాయంతో ఏర్పాటు చేసిన ఉపాధి హామీ పథకం దిమ్మెను సైతం ధ్వంసం చేశారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పేరుపై పేడ అలికారు. నాదెండ్ల మండలంలోని ఇర్లపాడు గ్రామం ఎస్సీ కాలనీలో టీడీపీ వర్గీయులు గొడ్డళ్లు, కర్రలతో వైయస్ఆర్ విగ్రహం తల, చేతులను విరగ్గొట్టారు. బైక్‌లకు టీడీపీ జెండాలు కట్టుకుని బాణసంచా కాలుస్తూ కాలనీలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు.