పలాస మండలంలోని బొడ్డపాడు అమర వీరుల స్మారకమందిరంలో ఈనెల పదోతేదీన కమ్యూనిస్టు భావజాలంపై అసత్య ప్రచారాలు, రాజ్యహింసకు వ్యతిరేకంగా జరిగే సదస్సును విజయవంతం చేయాలని ప్రజాసంఘాలసభ్యులు కోరారు. గురువారం బొడ్డపాడు అమరవీరుల స్మారక మందిరం ఆవరణలో నిర్వహించి న సమావేశంలో వారు మాట్లాడుతూ ఫాసిస్టు, హిం దూమతోన్మాద భావజాల ప్రభావానికి సమాజం గురవు తున్న నేపథ్యంలో తమ వంతు బాధ్యతగా ఈ కార్యక్ర మాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. సమావేశంలో సీపీఐఎంఎల్లిబరేషన్ నాయకులు తామాడ సన్యాసి రావు, పీవోడబ్ల్యు జిల్లా కార్యదర్శి పి.కుసుమ, ఏపీఎల్సీ జిల్లా నాయకులు పత్తిరి దానేసు, ప్రజాసంఘాల నాయకులు ఢిల్లీరావు, కె.నీలకంఠం, అరుణ, సాలిన వీరాస్వామి పాల్గొన్నారు.