మార్కాపురం శాసన సభ్యులు కందుల నారాయణరెడ్డి గురువారం తమిళనాడులోని అరుణాచలేశ్వరున్ని దర్శించుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిస్తే అరుణాచలం వెళ్లి స్వామిని దర్శించుకుని గిరిప్రదక్షిణ చేస్తానని ఆయన మొక్కుకున్నారు. మొక్కు తీర్చుకునేందుకు పలువురు కార్యకర్తలతో కలిసి బుధవారం రాత్రి అరుణాచలం బయలుదేరి వెళ్లారు. ప్రమాదంలో కాలికి గాయమై శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన ఆరోగ్యం సహకరించకున్నా సుమారు 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షణ చేశారు. ఆయన వెంట తర్లుపాడు మండల పార్టీ కన్వీ నర్ ఉడుముల చిన్నపరెడ్డి, పలువురు కార్యకర్తలు ఉన్నారు.