బైండోవర్ అయిన వారు హింసాత్మక ఘటనలు, ఘర్షణలకు దిగితే ష్యూరిటీ బాండ్ల మొత్తాన్ని ప్రభుత్వానికి కట్టించడం కాకుండా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఉరవకొండ సీఐ సురేష్ బాబు హెచ్చరించారు. జిల్లా ఎస్పీ గౌతమి శాలిని ఆదేశాల మేరకు శాంతిభద్రతల విషయంలో రాజీపడబోమని తెలియజేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరగడానికి సమస్యలు సృష్టించే వారిని గుర్తించి ఇదివరకే బైండోవర్లు చేయించామన్నారు.