గుంతకల్లు పట్టణంలోని ప్రధాన శ్రేణి గ్రంథాలయంలో గత 22 రోజులుగా గ్రంథాలయ అధికారి పి. కమ్మన్న ఆధ్వర్యంలో పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరాలు శుక్రవారం ముగిశాయి. ఈ సంధర్బంగా గ్రంథాలయాధికారి మాట్లాడుతూ వేసవి సెలవుల్లో విద్యార్థులకు గ్రంథాలయంలో నిర్వహించిన శిక్షణా శిబిరాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో ఉపగ్రంథాలయ అధికారిని హేమలత, రికార్డుఅసిస్టెంట్ రాము పాల్గొన్నారు.