కొత్తచెరువు మండలంలోని నారాయణపురం రైల్వే స్టేషన్ పరిధిలోని గుర్తుతెలియని యువకుడు రైలుక్రింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు హిందూపురం రైల్వే హెచ్. సి ఎర్రిస్వామి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ రైలు క్రింద ఆత్మహత్యకు పాల్పడడంతో శరీరం నుంచి తలవేరుగా అయ్యిందని తెలిపారు. 30 ఏళ్ల యువకుడు నీలంరంగు ప్యాంటు, సిమెంట్ కలర్ టీషర్టు, నల్లని బూట్లు ధరించారని తెలిపారు. మృతుడి దగ్గర ఎలాంటిఆధారాలు లభ్యం కాలేదని తెలిపారు.