జగన్నాథుని సన్నిధిలో ఈ నెల 9న కూచిపూడి నాట్యం చేసేందుకు ఇచ్ఛాపురం పట్టణానికి చెందిన వెంకటేశ్వర మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ చిన్నారులకు అరుదైన అవకాశం దక్కినట్లు అకాడమీ అధ్యక్షులు వెంకటేశ్వర పట్నాయక్ శుక్రవారం తెలిపారు. నాట్యగురువు శృతి పట్నాయక్, దట్టి కావ్య, నీలాపు శైలు, సిల్లా పూజ, ఆశీపు శ్వేతా రాణి, బి. దీక్షిత, ఎస్. రమ్యశ్రీ, బి. నిఖిత, డి. సింధు, పల్లవ ప్రణవి, మౌనిక, మధుశ్రీలకు అవకాశం దక్కింది.