కళ్యాణదుర్గం పట్టణంలోని విశ్రాంత ఉద్యోగ భవనంలో ఆదివారం విశ్రాంత ఉద్యోగులు కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు శివప్రసాద్, తిప్పేస్వామిలు మాట్లాడుతూ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు. తమకు రావలసిన బకాయిలను చెల్లిస్తారని ఆశాభావం తెలియజేశారు. రిటైర్డ్ ఎంపీహెచ్ఓ కే. వెంకటేశులు విశ్రాంత ఉద్యోగుల సంఘం మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 10, 116లు విరాళం అందజేశారు.