హిందూపురం పట్టణానికి చెందిన తేజేశ్వర్ రెడ్డి (28) అనే మెడికల్ విద్యార్థి ఆదివారం మృతి చెందాడు. కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు కర్నూల్ మెడికల్ కళాశాలలో ఎంబిబిఎస్ మూడవ సంవత్సరం చదువుతున్న తేజేశ్వర్ రెడ్డి మెడికల్ కాలేజ్ రీడింగ్ రూమ్లో చదువుకొని హాస్టల్ కి బైక్ పై వెళ్తున్న సమయంలో వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొని తేజేశ్వర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు.