నరసన్నపేట మిలీనియం లయన్స్ క్లబ్ ద్వారా శాశ్వత సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు సభ్యులు తీర్మానించారు. ఆదివారం లయన్స్ క్లబ్ అధ్యక్షులు సదాశివుని క్రిష్ణ అధ్యక్షతన జనరల్ బాడీ సమావేశం నరసన్నపేట లో జరిగింది. సమావేశంలో రానున్న లైనిస్టిక్ అధ్యక్షులుగా రమణ సాహు, కార్యదర్శి గా కే. సాయిరాం ను ఎన్నుకున్నారు. కార్యదర్శి వి. నాగరాజు, జెడ్ సి. ఊన్న రంగనాధ్, పాస్ట్ ప్రెసిడెంట్ బి. బాలకృష్ణ పాల్గొన్నారు.