ఇచ్చాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే బెందాళం అశోక్, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడును ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడలోని అచ్చెన్న నివాసంలో ఇరువురు ఎమ్మెల్యేలు కలిసి పుష్పగుచ్చం అందజేసి, దుస్సాలువాతో ఘనంగా సత్కరించారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కూటమి ప్రభుత్వం క్లిన్ స్వీప్ చేయడం సంతోషంగా ఉందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.