‘రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల అనంతరం జరుగుతున్న కవ్వింపు చర్యలు, దాడులపై టీడీపీ క్యాడర్ అప్రమత్తంగా ఉండాలి. కవ్వింపు చర్యల పట్ల నాయకులు సైతం అలెర్ట్‌గా ఉండి.. ఎటువంటి దాడులు, ప్రతి దాడులు జరగకుండా చూడాలి. రౌడీ మూకలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా పార్టీ కార్యకర్తలు పూర్తి సంయమనం పాటించాలి. పోలీసు అధికారులు సైతం శాంతి భద్రతలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు. ఢిల్లీలో బిజిబిజీగా ఉన్నప్పటికీ చంద్రబాబు స్పందించి ఈ సూచనలు చేశారు. దీంతో టీడీపీ నేతలు, పార్టీ కార్యకర్తలు అలర్ట్ అయ్యారు. మరీ ముఖ్యంగా పోలీసులు ఎక్కడా దాడులు జరగకుండా చూసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.