తిరుమల ఏఎస్పీ శివరామరెడ్డి శనివారం బదిలీ వేటుకు గురయ్యారు. నేరుగా ఆయన్ను పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాలని డీజీపీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీ హర్షవర్దనరాజుకు సూచించారు.టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు,టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని మూడేళ్ల క్రితం అరెస్టు చేసిన సమయంలో శివరామరెడ్డి కాశీబుగ్గ డీఎస్పీగా పనిచేసేవారు.