వరప్రసాద్‌కు శిరోముండనం చేసింది మరిచిపోలేదు. దళిత బిడ్డను వైసీపీ వర్గాలు మానభంగం చేసి పోలీస్టేషన్ ముందు పడేసింది మరిచిపోలేదు. మాస్క్ పెట్టుకోలేదని దళిత బిడ్డను కిరణ్ కుమార్‌ను కొట్టి కొట్టి చంపింది మరిచిపోలేదు.నీ దొంగ సారాపై ప్రతాప్ మాట్లాడితే తెల్లారేసరికి చంపేసి ఉరేసుకున్నట్లు చిత్రీకరించారు దాన్ని మరిచి పోలేదు. వెటర్నరీ డాక్టర్ అచ్చెన్న హత్యను మరిచిపోలేదు. నకరికల్లులో గిరిజన మహిళను ట్రాక్టర్‌తో తొక్కించింది మరిచిపోలేదు. టంగుటూరు దగ్గర దళిత మహిళను చనిపోయే వరకు ట్రాక్టర్‌తో తొక్కించింది దళిత బిడ్డలు మరచిపోలేదు.చంద్రయ్య అనే వ్యక్తి జై చంద్రబాబు అన్నందుకు పీక కోసి చంపింది మరచిపోలేదు.గవర్నర్ దగ్గరకు వెళ్లి కళ్లబొల్లి సాకులు చెబుతున్నారు. మాచర్లలో రావణకాండను మరచిపోయారా అప్పేడే?. నంగనాచిలా ఏ తప్పు చేయనట్లు మాట్లాడుతారా? అమరావతిలో దళిత రైతులకు బేడీలు వేసి వీధుల్లో తిప్పింది మా దళిత బిడ్డలు మరిచిపోలేదు అని వర్లరామయ్య పేర్కొన్నారు