గుమ్మఘట్ట: నైరుతి రుతుపవనాలు రాయలసీమను తాకాయి. దీంతో ఆదివారం రాయదుర్గం లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కర్ణాటక రాష్ట్రంలోనూ విస్తారంగా వానలు కురుస్తుండడంతో దిగువనున్న బీటీ ప్రాజెక్టు వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ నీటి సామర్థ్యం సముద్ర మట్టానికి 1, 655 అడుగులు కాగా, ఆదివారం 1, 644. 6 అడుగులకు నీరు చేరింది. 220 క్యూసెక్కులతో ఇన్ ఫ్లో కొనసాగుతున్నట్టు సంబంధితశాఖ ఏఈ హరీష్ తెలిపారు.