ఎచ్చెర్ల పరిధిలోని కుశాలపురం సమీపం నవభారత్ వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. లావేరు మండలం బెజ్జిపురం పంచాయతీ వెంకటరావుపేట గ్రామానికి చెందిన పిన్నింటి రామ్‌కుమార్(32) ఓ కేబుల్ ఆపరేటర్ సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి శ్రీకాకుళం విధులు ముగించుకుని బైక్‌పై స్వగ్రామానికి వెళ్తుండగా నవభారత్ జంక్షన్ సమీపంలో ఆగి ఉన్న లారీ ఢీకొని అక్కడికక్కడే మృతిచెందారు. రామ్‌కుమార్‌కు తల్లిదండ్రులు అప్పారావు, కళావతి ఉన్నారు. ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.