ఎర్రగొండపాలెం పంచాయతీ ఆవరణలో 2019లో ‘వేగినాటి కోటయ్య’ పేరుతో గ్రామ పంచాయతీ వాణిజ్య కాంప్లెక్సును పంచాయతీ నిధులతో నిర్మించారు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టగానే స్థానిక వైసీపీ నాయకులు రాత్రిపూట వైసీపీ నాయకులు వేగినాటి కోటయ్య పేరును తొలగించారు. అప్పట్లోనే టీడీపీ శ్రేణులు దీనిపై ఆందోళన వ్యక్తం చేశాయి. అప్పట్లో పోలీసులు అధికారపార్టీ వైపు ఉండడంతో టీడీపీ నాయకులు నిరసనతో సరిపెట్టుకున్నారు. పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసిన పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 2023 ఏప్రిల్ 20న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎర్రగొండపాలెం పర్యటనకు వచ్చిన సమయంలో గ్రామ పంచాయతీ కాంప్లెక్సుకు శ్రీ వేగినాటికోటయ్య పేరుపెడితే వైసీపీ నాయకులు అక్రమంగా తొలగించారని, టీడీపీ అధికారం చేపట్టగానే తిరిగి శ్రీ వేగినాటి కోటయ్య పేరు కాంప్లెక్స్‌కు పెడతామని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి రాగానే టీడీపీ నాయకులు కోరిక మేరకు పంచాయతీ కార్యదర్శి రాజశేఖరెడ్డి రికార్డులలో ఉన్న ప్రకారం వాణిజ్య కాంపెక్సుకు శ్రీవేగినటి కోటయ్య పేరు ఆదివారం రాయించారు. దీంతో టీడీపీ కేడర్ హర్షం వ్యక్తం చేస్తోంది.