పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బోడె ప్రసాద్ రేషన్ డీలర్ల పక్షపాతి అని ఉయ్యూరు మండల రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు రెడ్డి రమణ కొనియాడారు. ఆదివారం ఉయ్యూరు మండల రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు రెడ్డి రమణ ఆధ్వర్యంలో పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్ ని మర్యాద పూర్వకంగా కలిసి రేషన్ డీలర్ల సంఘం తరపున అభినందనలు తెలియచేయటం జరిగింది.