జాతీయ రహదారి పలాస బైపాస్ కంబిరిగాం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అర్చకుడు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సోంపేట మండలం రామయ్యపట్నం గ్రామానికి చెందిన రమేష్‌కుమార్ పాణిగ్రాహి (45) అనే అర్చకుడు మృతి చెందాడు. ఈయన టెక్కలి మీదుగా స్వగ్రామానికి ద్విచక్ర వాహనం వెళ్తుండగా అదుపుతప్పి ఫ్లైఓవర్ రక్షణ గోడకు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అదే గ్రామ ఆలయ అర్చకుడిగా పాణిగ్రాహి జీవనం పొందుగున్నాడు. ఈయనకు భార్య ప్రత్యూష ఉన్నారు. ఎస్ఐ పారినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.