శ్రీకాకుళంనగరానికి చెందిన ఓ యువకుడు మూడు రోజులుగా కనిపించడం లేదని అతడి మేనమామ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వన్ టౌన్ ఎస్‌ఐ-2 కామేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు.. స్థానిక చిన్నబరాటం వీధిలో ఓ రూములో నివాసం ఉంటున్న లంక రాజా అలియాస్ లక్కీ(24) అమెజాన్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం తన స్నేహితుడు శివను పాత బస్టాండ్‌కు రప్పించి, డీఎస్పీ కార్యాలయం ఎదురుగా ఉన్న ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో ఆహారాన్ని తిన్నారు. అనంతరం స్నేహితుడి సెల్‌ఫోన్‌ను తీసుకుని బయటకు వెళ్లిన రాజా తిరిగి రాలేదు. ఈ విషయం తెలుసుకున్న అతడి మేనమామ పిరియా రాజా వన్‌టౌన్ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై ఎస్‌ఐ పి.కామేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa