అనంతపురం నగర శాసన సభ్యులుగా ఎన్నికైన దగ్గుపాటి ప్రసాద్ ని ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు, సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు శనివారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా సంఘ రాష్ట్ర కార్యదర్శి వీ. లక్ష్మినారాయణ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శివ శంకర్, మహేష్ నాయక్ లు పాల్గొన్నారు.