ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలి సిపిఎం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శనివారం చిలమత్తూరు మండలంలోని చాగలేరు నంజీరెడ్డిపల్లి, పెద్దరెడ్డిపల్లి గ్రామాలలో ఉపాది పనులు పరిశీలన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కూలీలకు పెండింగ్ ఉన్న బిల్లులు చెల్లించాలని, పనిముట్లు పంపిణీ చేయాలని, పెరిగిన కూలీరేట్లు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.