లేపాక్షి మండల పరిధిలోని కంచి సముద్రం సెక్టార్ లోని తిలక్ నగర్ లో శనివారం అంగన్వాడీ పిలుస్తుంది కార్యక్రమం చేపట్టారు. సీడీపీఓ ఆదేశాల మేరకు గర్భవతులు, 6 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలు తల్లులను సమావేశం నిర్వహించి పూర్వప్రాధమిక విద్య ప్రాముఖ్యత పై అవగాహన కల్పించారు. అంగన్వాడీలో చేర్పించడం ద్వారా పిల్లల శ్యారీరక, మానసిక, మేధాశక్తి పెరుగుతుందన్నారు. అంగన్వాడీ ముద్దు కాన్వెంట్ వద్దు అంటూ ర్యాలీ నిర్వహించారు.