కణేకల్లు మండలం తుంబిగనూరులో వాటర్ ఫిల్టర్ ట్యాంక్లో జరిగిన విషప్రయోగంపై పోలీసులు విచారణ చేపట్టారు. డీఎస్పీ బీ. శ్రీనివాసులు శనివారం గ్రామానికి చేరుకుని ఘటనపై విచారిస్తున్నారు. ట్యాంక్లో పురుగుల మందు ఎలా కలిపారో క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రాథమిక ఆధారాలు సేకరించారు. రాజకీయ కోణంలో ఏదైనా కుట్ర జరిగిందా? అనే కోణంలోనూ విచారణ చేస్తున్నారు. ఎస్ఐ శ్రీనివాస్ ఆయన వెంట ఉన్నారు.