ధర్మవరం ఒకటో పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం శనివారం శాంతి కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రానున్న బక్రీద్ పండుగ నేపథ్యంలో శాంతియుతంగా పండుగను నిర్వహించుకోవాలని సీఐ సూచించారు. అన్ని మతాలకు సంబంధించిన శాంతి కమిటీ పెద్దలను పోలీస్ స్టేషన్ లోకి పిలిపించి పలు సూచనలు చేశారు. బక్రీద్ పండుగ ను శాంతియుతంగా నిర్వహించుకోవడానికి తమ వంతు కృషి చేస్తామని అన్ని మతాల పెద్దలు తెలిపారు.