డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ఈ నెల 16న మంత్రిగా తొలిసారి జిల్లాకు రానున్న నేపథ్యంలో ఘనంగా స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు టిడిపి ఒంగోలు పార్లమెంట్ ఉపాద్యక్షులు రామయ్యచౌదరి తెలిపారు. 16న మధ్యాహ్నం 3 గంటలకు చిలకలూరిపేట మండలంలోని బొప్పూడి ఆంజనేయస్వామి గుడిలో పూజా కార్యక్రమం, అక్కడ నుంచి ర్యాలీగా వల్లూరమ్మ తల్లి దేవస్థానం వద్దకు చేరుకుని అక్కడ పూజా కార్యక్రమం ఉంటుందన్నారు.