ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పోలీస్ స్టేషన్ నందు శనివారం సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిఐ మాట్లాడుతూ బక్రీదు పండుగ సందర్భంగా గోవులను వధిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేస్తున్నందున ఎవరు కూడా గోవుల్ని వధించవద్దని తెలియజేశారు. బక్రీద్ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని కోరారు.