కలసపాడు మండలంలోని ఎగువ రామాపురం గ్రామానికి చెందిన అన్నవరం సుబ్బలక్ష్మి శుక్రవారం విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కొద్ది రోజులుగా ఆరోగ్యం సరిగా లేకపోవడంతో మనస్థాపానికి గురైన సుబ్బలక్ష్మి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. మృతురాలి తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగ మురళి శనివారం విలేకరులకు తెలియజేశారు.