యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్(యూపీఎస్సీ) నేతృత్వంలో సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు ఆదివారం విజయవాడలో జరగబోతున్నాయి. మొత్తం 11,112 మంది అభ్యర్థులు సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు రాయనున్నారు. పరీక్షలు రాయడం కోసం విజయవాడలో 25 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. సివిల్స్ ప్రిలిమ్స్ రాసే అభ్యర్థుకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పేపర్-2 పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షల నిర్వహణకు ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం 25 మంది రూట్ అధికారు లను, 25 మంది సహాయ సూపర్‌వైజర్లను నియమించింది. వీరంతా పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తారు. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షల ఏర్పాట్లపై నిర్వహించిన సమావేశంలో అధికారులతో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ దిల్లీ రావు సమీక్షించారు. పరీక్షా కేంద్రాలలో ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాలపై చర్చించారు. పరీక్షా కేంద్రాల దగ్గర పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు శాఖను, వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని జిల్లా ఆరోగ్య శాఖను, విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్‌శాఖాధికారులకు సూచించారు. అభ్య ర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ఆయా రూట్లలో అదనపు బస్సులను నడపాలని ఆర్టీసీ అధికా రులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల దగ్గర సీసీ కెమె రాలు ఏర్పాటు చేసి నిఘా పెట్టాలని, జామర్లను ఏర్పాటు చేయాలని పోలీసులను ఆదేశించారు. యూపీ ఎస్సీ ఉన్నతాధికారులు ఇచ్చిన చెక్‌లిస్ట్ ప్రకారం అన్ని ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు. అనం తరం కలెక్టర్ దిల్లీరావు మీడియాతో మాట్లాడారు. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసు కుని పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టినట్టు తెలిపారు.