కొరిసపాడు మండలం మేదరమెట్ల లోని విత్తన దుకాణాలను ఏడిఏ శ్రీనివాసరావు వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణంలోని రికార్డులను ఆయన పరిశీలించారు. విత్తనాలను పరిశీలించి వాటి వివరాలను యజమానుల నుంచి అడిగి తెలుసుకున్నారు. విత్తనాలు కొనుగోలు కోసం వచ్చిన రైతులకు తప్పనిసరిగా రసీదులు ఇవ్వాలని శ్రీనివాసరావు సూచించారు. లేనిపక్షంలో తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.