కందుకూరు పట్టణ పరిధిలోని ఉప్పు చెరువు వద్ద గల ఓ కాలువలో ఆదివారం ఓ యువకుడి మృతదేహం నీటి మీద తేలాడుతుండగా స్థానికులు గుర్తించారు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పట్టణ పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడు స్థానిక పట్టణంలోని ముత్త రాసి పాలెంకు చెందిన క్యాటరింగ్ చేసే వ్యక్తి కిశోర్ గా గుర్తించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.