బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని నిడదవోలు పట్టణంలోని సున్నీ జూమియా మసీదులో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల. దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం దుర్గేష్ వారితో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు పాల్గొన్నారు.