పేద ప్రజల సంక్షేమం కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాన హామీల అమలుపై తొలి సంతకం చేశారని రాజం పేట టీడీపీ ఇనచార్జి సుగ వాసి బాలసుబ్రమణ్యం తెలిపారు. ఆదివారం సుండుపల్లె మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... నిరుద్యోగులను నట్టేట ముంచిన జగనమోహనరెడ్డికి తగిన గుణపాఠం చెప్పారన్నారు.. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రానికి మంచి జరుగుతుందన్న ఆశతో నిరుద్యోగులు, వృద్ధులు, వికలాంగులు, రైతులు, ఉద్యోగులు కూటమికి అఖండ విజయాన్ని అందించారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల క్లస్టర్ ఇనచార్జి శివకుమార్ నాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు ప్రసాద్‌రాజు, శివరాంనాయుడు, వెంకటేశ్వర్లునాయుడు, మేకల మహబూబ్‌బాషా, మాలేపాటి సురేశనాయుడు, కిరణ్, మంగిరి రమణయ్య, మస్తాన బాబు, నాగసుబ్బయ్య, సిద్దయ్య, జనసేన మండల మహిళా నాయకురాలు రెడ్డిరాణి తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |