ప్రత్యక్షదైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని సోమవారం ఉదయం సినిమా నిర్మాత, మాజీ శాసనసభ్యులు పీవీవీపీ కృష్ణారావు( అంబికా కృష్ణ ) కుటుంబ సమేతంగా దేవాలయంనకు విచ్చేసి శ్రీ స్వామి వారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఘన స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామి వారి జ్ఞాపికను ఆలయ ఈవో ఎస్. చంద్రశేఖర్ అందజేశారు.