ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు రాజకీయ వేధింపులు ఆపాలని ఆ పథక కార్మికులు జిల్లా అధ్యక్షురాలు అల్లు మహాలక్ష్మీ అన్నారు. సోమవారం మందస మండల కేంద్రంలో మండల మధ్యాహ్న భోజన కార్మికులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచాలని, అలాగే ఇతర సమస్యల పరిష్కారానికై , భవిష్యత్తు పోరాటాలకు కార్మికులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.