అనంతపురం జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ హామీ ఇచ్చారు. తాను రాష్ట్రానికి మంత్రిని అయినా.. అనంతపురం జిల్లాకు కూలీనేనని తెలిపారు. తాగు, సాగునీటి కోసం జరిగిన పోరాటాల మధ్య తాను పెరిగానని చెప్పారు. జిల్లా ప్రజలు చూపిస్తున్న అభిమానాన్ని ఎప్పటికీ మరువలేనని అన్నారు. జిల్లా రైతాంగాన్ని ఆదుకునేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని మాటిచ్చారు. జిల్లా ప్రజల నమ్మకానికి మించి పని చేస్తానని అన్నారు. ఆర్థిక మంత్రిగా అత్యంత బరువు బాధ్యతలు మోయాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వ ఖజానాకు సంబంధించి ఇంతవరకు లెక్కలు చూడలేదని అన్నారు. లెక్కలు చూస్తే అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో లెక్కలు చూడాల్సిన అవసరముందని అన్నారు. రాష్ట్రాన్ని బాగు చేయాలి.. అభివృద్ధి పరుగులు పెట్టించాలని కోరారు. ఇదే ఆశయంతో మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేస్తానని మంత్రి పయ్యావుల కేశవ్ హామీ ఇచ్చారు.
![]() |
![]() |