నెల్లూరు జిల్లాలో పెద్దపులి కలకలం సంచలనం రేపింది. మర్రిపాడు మండలం, కదిరినాయుడుపల్లి అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తోంది. కదిరినాయుడిపల్లి వద్ద ముంబాయి - నెల్లూరు జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనాలపై పెద్దపులి దాడి చేసింది. ఒక్క సారిగా పెద్దపులి వాహనాలపై దాడి చేయడంతో ప్రయాణీకులు భయభ్రాంతులకు గురయ్యారు. పెద్దపులి సంచారంతో అటవీ ప్రాంత గ్రామాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటన ప్రాంతానికి చేరుకుని సమీక్షించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
![]() |
![]() |